జగన్నాథుడి డబ్బులు ఎస్‌బీఐకు
close
Published : 20/03/2020 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగన్నాథుడి డబ్బులు ఎస్‌బీఐకు

దిల్లీ: యెస్‌ బ్యాంకులో పూరి జగన్నాథ స్వామికి చెందిన రూ.389 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఎస్‌బీఐకి బదిలీ చేసినట్లు యెస్‌ బ్యాంకు గురువారం తెలిపింది. శ్రీ జగన్నాథ్‌ టెంపుల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేరు మీద ఆ ఎఫ్‌డీ ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ మొత్తంపై రూ.8.23 కోట్ల మేర వడ్డీ పొందినట్లు తెలుస్తోంది. ‘ఎఫ్‌డీ నిబంధనల ప్రకారం.. డిసెంబరు 31, 2019 వరకు త్రైమాసిక వడ్డీని చెల్లించాం. మార్చి 19, 2020 వరకు వచ్చే వడ్డీని రూ.389 కోట్ల అసలుతో పాటు కలిపి ఎస్‌బీఐలోని జగన్నాథ్‌ టెంపుల్‌ కార్పస్‌ఫండ్‌కు బదిలీ చేసినట్లు’ గురువారం యెస్‌ బ్యాంకు తెలిపిన లేఖలో ఉంది. కాగా రూ.156 కోట్ల విలువైన మరో రెండు ఎఫ్‌డీలను ఈ నెలాఖరులో బదిలీ చేస్తామని అందులో పేర్కొంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని