అన్ని బంకుల్లో బీఎస్‌-6 ఇంధన సరఫరా: ఐఓసీ
close
Published : 23/03/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్ని బంకుల్లో బీఎస్‌-6 ఇంధన సరఫరా: ఐఓసీ

దిల్లీ: దేశవ్యాప్తంగా బీఎస్‌-6 ఇంధన సరఫరాను ప్రారంభించిన మొదటి సంస్థగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) అవతరించింది. ఏప్రిల్‌ 1 గడువు కంటే రెండు వారాల ముందే బీఎస్‌-6 ఇంధనాన్ని.. దేశవ్యాప్తంగా ఉన్న 28,000 పెట్రోల్‌ బంకుల్లో సరఫరా చేస్తున్నట్లు ఐఓపీ ఛైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ వెల్లడించారు. బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6 ప్రమాణాలకు కేవలం మూడేళ్లలో మారామని, ప్రపంచంలో మరే దేశం ఇలాంటి ఘనత సాధించలేదని సంజీవ్‌ అన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండానే బీఎస్‌-6కు మారామని తెలిపారు. ఇతర చమురు రిటైల్‌ సంస్థలు బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కూడా బీఎస్‌-6 ఇంధనం సరఫరా చేస్తున్నాయి. అయితే తమ బంకులన్నింటికీ బీఎస్‌ 6 ఇంధనాన్ని సరఫరా చేసేందుకు వీటికి మరోవారం సమయం పట్టే అవకాశం ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని