ప్రీమియం చెల్లింపులకు గడువు పొడిగింపు: ఎల్‌ఐసీ
close
Updated : 12/04/2020 10:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రీమియం చెల్లింపులకు గడువు పొడిగింపు: ఎల్‌ఐసీ

ముంబయి: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) పాలసీదార్లకు ఊరట. మార్చి, ఏప్రిల్‌ నెల ప్రీమియం చెల్లింపులకు గ్రేస్‌ పీరియడ్‌ను ఎల్‌ఐసీ నెల రోజులు పొడిగించింది. అన్ని రకాల బీమా పాలసీలకు ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రీమియం చెల్లింపుల విషయంలో పాలసీదార్లకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఎల్‌ఐసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెల ప్రీమియాన్ని కూడా ఏప్రిల్‌ 15వ తేదీ వరకు చెల్లించేందుకు వీలు కల్పించింది. అలాగే పాలసీదార్లు ఆన్‌లైన్‌ పద్ధతిలోనూ ప్రీమియం చెల్లింపులు చేసుకోవచ్చని, ఇందుకు ఎటువంటి సేవా రుసుం పడదని ఎల్‌ఐసీ తెలిపింది. యూపీఐ ఆధారిత యాప్‌లు, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డుల సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఎల్‌ఐసీ యాప్‌ ఎల్‌ఐసీ పే డైరెక్టు ద్వారా కూడా ప్రీమియం చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే కొవిడ్‌-19కు సంబంధించిన మరణాలకు కూడా ప్రస్తుత, కొత్త పాలసీల కింద పరిహారం లభిస్తుందని ఎల్‌ఐసీ తెలిపింది. అంతేకాకుండా ఈ తరహా క్లెయిమ్‌లకు తక్షణ ప్రాతిపదికన పరిహార చెల్లింపులు చేస్తున్నామని వెల్లడించింది. ఇప్పటివరకు ఇలాంటివి 16 క్లెయిమ్‌లను ప్రాసెస్‌ చేశామని పేర్కొంది. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు 5 బీమా పథకాలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్‌ఐసీ తెలిపింది. అవి.. ఎల్‌ఐసీ టెక్‌ టర్మ్‌, జీవన్‌ సాథీ యాన్యూటీ ప్లాన్‌, కేన్సర్‌ కవర్‌, ఎస్‌ఐఐపీ, నివేశ్‌ ప్లస్‌.
అదే దారిలో ఇండియా పోస్ట్స్‌..
ఎల్‌ఐసీ మాదిరి ఇండియా పోస్ట్స్‌ కూడా ప్రీమియం చెల్లింపు విషయంలో పాలసీదార్లకు వెసులుబాటును కల్పించింది. పోస్టల్‌ లైప్‌ ఇన్సూరెన్స్‌, రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల మార్చి, ఏప్రిల్‌, మే నెలల ప్రీమియం గడువు తేదీని జూన్‌ 30 వరకు పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుం/ జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ మూడు నెలల ప్రీమియంను జూన్‌ 30 వరకు చెల్లించవచ్చని ఇండియా పోస్ట్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని