ఇండిగోతో మొదలై.. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ వరకు!
close
Published : 15/04/2020 19:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇండిగోతో మొదలై.. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ వరకు!

ట్విటర్‌లో విమానయాన సంస్థల సరదా సంభాషణ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ప్రైవేట్‌ విమానయాన సంస్థలు ట్విటర్‌లో సరదాగా సంభాషించాయి. ప్రస్తుత పరిస్థితులకు అద్దంపడుతూ సరదా ట్వీట్‌లు చేస్తూ ఇంట్లోనే ఉండాలని ప్రజలకు సందేశాల్ని ఇస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా విమానయాన సంస్థలు తమ కార్యకలపాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ‘ఇండిగో’ సంస్థ శుక్రవారం ‘విస్తారా’ సంస్థను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ‘హలో విస్తారా..మీరు ఎక్కువగా ఎగరట్లేదని (#flyinghigher) మేం విన్నాం’’ అని ఇండిగో ట్వీట్ చేసింది. విస్తారా సంస్థ ప్రకటనల్లో వాడే ‘ఫ్లైయింగ్ హైయర్‌’ను ట్యాగ్‌ లైన్‌ ట్వీట్‌లో పోస్ట్‌ చేసింది.

దీనికి విస్తారా..‘‘ఈ రోజుల్లో గ్రౌండ్‌లో ఉండటమే గొప్ప విషయం. ఎగరడం తెలివైన పనికాదు. దీనిపై ఏమంటావ్‌ గోఎయిర్?’’ అని గోఎయిర్‌ సంస్థను ట్యాగ్‌ చేస్తూ బదులిచ్చింది. ‘‘ఇంట్లో ఉండటమే సురక్షితం. ప్రతి ఒక్కరూ ఆకాశంలోకి ఎగిరే వరకు వేచి ఉంటాం. ప్రస్తుతం ఎవరు ఎగరకూడదు కదా? ఏయిర్‌ఆసియాఇండియా‌’’ అని గోఎయిర్‌ సమాధానమిచ్చి ‘ఎయిర్‌ఆసియాఇండియా’ సంస్థను సంభాషణలోకి తీసుకువచ్చింది.

‘‘కచ్చితంగా ఇంట్లోనే ఉండటమే రెడ్‌ (శ్రేయస్కరం). ‘స్పైసీ’ పనులు చేయవచ్చు. అంతే కదా స్పైస్‌జెట్’‌’ అని ఎయిర్‌ఆసియా ఇండియా ట్వీట్ చేసింది.  దీనికి స్పైస్‌జెట్..‘‘మన రంగులు కలిసినట్లే మన ఆలోచనలు కూడా కలిశాయి ఎయిర్‌ఆసియా ఇండియా. కొంతకాలం క్రితం పక్షి తన పంజరం నుంచి బయటకు వచ్చింది. అయితే సురక్షితమైన రేపటి కోసం మనం శ్రమిస్తున్నాం. అంతేనా దిల్లీ ఎయిర్‌ పోర్ట్‌’’ అని ట్వీట్ చేసింది. ఎయిర్‌ ఇండియా, స్పైస్‌ జెట్‌ సంస్థల చిహ్నాలు రెడ్‌ కలర్‌లోనే ఉంటాయి. ‘‘ఇండిగో, విస్తారా, గోఎయిర్, ఎయిర్‌ఆసియాఇండియా, స్పైస్‌జెట్‌.. ఆలోచనలతో అంగీకరిస్తున్నాను. త్వరలో భారత ఆకాశం మీ వల్ల రంగులతో మారుతుంది. నవ్వించినందుకు కృతజ్ఞతలు. ఆకాశంలో అయినా నేలపై అయినా కలిసే ఉండాలి’’ అని స్పైస్‌జెట్‌ చేసిన ట్వీట్‌కు దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ జవాబుచ్చింది. సరదా సంభాషణ మొదలుపెట్టిన ఇండిగో ముగింపు ఇచ్చింది. మీరు మాతో ఉన్నందుకు ఎంతో బలంగా ఉందని ట్వీట్‌ చేసింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని