పెట్రోల్‌ ధరలో మూడోవంతుకే విమాన ఇంధనం
close
Updated : 04/05/2020 04:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోల్‌ ధరలో మూడోవంతుకే విమాన ఇంధనం

దిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బాగా తగ్గడంతో, దేశీయంగా విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు గణనీయంగా దిగివచ్చాయి. తాజా సవరణల్లో భాగంగా, ఒక్కసారిగా 23 శాతం ధర తగ్గించడంతో, పెట్రోల్‌-డీజిల్‌ ధరలో మూడోవంతుకే ఏటీఎఫ్‌ లభిస్తోంది. అయితే పన్నుల భారం తగ్గించకపోవడంతో, 50వ రోజున (ఆదివారం) కూడా   పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు.  ప్రభుత్వరంగ చమురు సంస్థల దిల్లీ ధరల ప్రకారం.. ఏటీఎఫ్‌ కిలోలీటర్‌ (వెయ్యి లీటర్ల) ధరను రూ.6812.62 మేర (23.2 శాతం) తగ్గించడంతో, ప్రస్తుతం రూ.22,544.75కు లభిస్తోంది. అంటే లీటర్‌ ఏటీఎఫ్‌ రూ.22.54 మాత్రమే. అదే లీటర్‌ పెట్రోల్‌ వచ్చేసరికి రూ.69.59 అవుతోంది. బస్సులు, లారీలకు వినియోగించే డీజిల్‌ ధరా లీటర్‌ రూ.62.29 కావడం గమనార్హం. ఎటువంటి రాయితీ లేని కిరోసిన్‌ ధర కూడా 13.3 శాతం తగ్గడంతో, లీటరు రూ.39.67కే లభిస్తోంది.
ధరల్లో ఆరోసారి కోత
గతంలో నెలకోసారి మాత్రమే ఏటీఎఫ్‌ ధరలను సవరించేవారు. అయితే మార్చి 21 నుంచి 15 రోజులకోసారి మార్చాలని నిర్ణయించి, అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి చూస్తే ఏటీఎఫ్‌ ధరలను ఇప్పటికి ఆరుసార్లు తగ్గించారు. అయితే భారీగా తగ్గించడం మాత్రం ఇప్పుడే. ఫిబ్రవరిలో దిల్లీలో కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.64,323.76 కాగా ఇప్పుడు రూ.22,544.75 మాత్రమే. ఇతర మహా నగరాల్లోనూ ఇదే స్థాయిలో తగ్గింపు ఏటీఎఫ్‌కు వర్తింప చేశారు. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో, మార్చి మూడోవారం నుంచి విమాన సర్వీసులు నిర్వహించనందున, విమానయాన సంస్థలకు ప్రయోజనం ఏమీ కలగడం లేదు.
ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు ఏటీఎఫ్‌ ధరలను మార్కెట్‌ కనుగుణంగా ఎప్పటికప్పుడు సవరిస్తున్నా, మార్చి 16 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు. ఎక్సైజ్‌ డ్యూటీని ప్రభుత్వం లీటరుకు రూ.3 మేర పెంచింది కూడా. అయితే ముడిచమురు ధర తగ్గినందున, ఈ భారాన్ని ప్రజలకు బదలాయించలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని