రికార్డు కనిష్ఠానికి తయారీ
close
Published : 05/05/2020 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రికార్డు కనిష్ఠానికి తయారీ

ఏప్రిల్‌లో 27.4 కు పరిమితం

దిల్లీ: దేశ తయారీ రంగ కార్యకలాపాలు రికార్డు కనిష్ఠానికి చేరాయి. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉండటంతో కంపెనీల్లో కార్యకలాపాలు సాగకపోడానికి తోడు కొత్త ఆర్డర్లు భారీగా క్షీణించాయని పీఎంఐ సర్వే వెల్లడించింది. పలు కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోవడమూ ప్రభావం చూపింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఏప్రిల్‌ 27.4 పాయింట్లుగా నమోదైంది. మార్చిలో ఇది 51.8 వద్ద ఉంది. తయారీ గణాంకాలు రూపొందించడం మొదలైన తర్వాత.. గత 15 ఏళ్లలో ఇదే అత్యంత భారీ క్షీణతగా తెలుస్తోంది. వరుసగా 32 నెలలపాటు వృద్ధి సాధించిన సూచీ.. మొదటి సారి ప్రతికూల వృద్ధిలోకి దిగజారింది. పీఎంఐ గణాంకాల ప్రకారం.. 50 పాయింట్ల ఎగువన నమోదైతే వృద్ధిని సూచిస్తుంది. అంతకంటే తక్కువైతే క్షీణతగా పరిగణిస్తారు. పలు వ్యాపారాలు మూతపడటంతో, గిరాకీ పరిస్థితులు దారుణంగా దెబ్బతిన్నాయని సర్వే తెలిపింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేయడమే ఉత్పత్తి తగ్గడానికి కారణమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక ఎగుమతి ఆర్డర్లు కూడా గణనీయంగా తగ్గాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని