ఆరోగ్య అంకురాల్లో వినూత్నతకు సీమెన్స్‌ హెల్తీనీర్స్‌, నాస్‌కామ్‌ జట్టు
close
Published : 29/05/2020 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్య అంకురాల్లో వినూత్నతకు సీమెన్స్‌ హెల్తీనీర్స్‌, నాస్‌కామ్‌ జట్టు

దిల్లీ: ఆరోగ్య సంరక్షణ రంగంలోని అంకుర సంస్థల వినూత్నతకు మద్దతు అందించేందుకు మెడికల్‌ టెక్నాలజీ సంస్థ సీమెన్స్‌ హెల్తీనీర్స్‌, ఐటీ పరిశ్రమ సంఘం నాస్‌కామ్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. సీమెన్స్‌ హెల్తీనీర్స్‌, నాస్‌కామ్‌కు చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ ఐఓటీ, కృత్రిమ మేధ సంయుక్తంగా భారత అంకుర సంస్థలతో కలిసి పనిచేయనున్నాయి. ఆరోగ్య సంరక్షణ విధానాలను మరింత సులభంగా, అందుబాటు ధరకు తీసుకురావడమే లక్ష్యమని ఈ సంస్థలు చెబుతున్నాయి. ఈ భాగస్వామ్యంతో భారత అంకుర సంస్థలకు సీమెన్స్‌ హెల్తీనీర్స్‌కు ఉన్న అంతర్జాతీయ అనుభవం దోహదపడనుంది. ఇమేజింగ్‌, డయగ్నోస్టిక్స్‌, డిజిటల్‌ హెల్త్‌ లెవరేజింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ మెడికల్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌లో సీమెన్స్‌కు విశేష అనుభవం ఉంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని