పెట్రోల్ హోం డెలివరీ!
close
Published : 30/05/2020 18:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోల్ హోం డెలివరీ!

దిల్లీ: ఇతర నిత్యావసరాల మాదిరిగానే పెట్రోల్, సీఎన్‌జీని హోం డెలివరీ చేసేందుకు కేంద్రం త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో వాహనదారులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌  వెల్లడించారు. 2018 నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొన్ని నగరాల్లో మొబైల్ డిస్పెన్సర్లతో డీజిల్‌ను‌ హోం డెలివరీ చేస్తోంది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని స్టార్టప్‌ కంపెనీ రెపోస్ ఎనర్జీ.. మొబైల్ పెట్రోల్ పంప్‌ల తయారీకి ముందుకొచ్చింది. వాటి ద్వారా ఇంటివద్దకే పెట్రోల్‌ సరఫరా చేసే వీలు కలుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,200 మొబైల్ పెట్రోల్ పంపులను ఉత్పత్తి చేస్తామని ఆ కంపెనీ తెలిపింది. 

ఇదిలా ఉండగా, సీఎన్‌జీ, ఎల్ఎన్‌జీ, పీఎన్‌జీ వంటి అన్ని రకాలైన ఇంధనాలు ఒకే దగ్గర లభ్యమయ్యేలా ఇంధన స్టేషన్లను పునరుద్ధరిస్తామని మంత్రి సూచనప్రాయంగా వెల్లడించారు. అలాగే వాటికోసం జనాలు బారులు తీరి ఉండకుండా చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌ నెలలో ఆయిల్ డిమాండ్ 70 శాతం తగ్గింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని