మోటార్‌ వెహికల్స్‌ నిబంధనల సవరణలపై సలహాలకు ఆహ్వానం
close
Published : 04/06/2020 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోటార్‌ వెహికల్స్‌ నిబంధనల సవరణలపై సలహాలకు ఆహ్వానం

దిల్లీ: డ్రైవింగ్‌ లైసెన్సులు, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌, లోపభూయిష్ట వాహనాల రీకాల్‌ వంటి అంశాలపై ప్రతిపాదిత మోటార్‌ వాహనాల నిబంధనల సవరణపై అందరు భాగస్వాముల నుంచి ప్రభుత్వం సలహాలను కోరుతోంది. లోపభూయిష్ట వాహనాల విషయంలో వాహనాల సంఖ్య, రకాన్ని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అపరాధ రుసుమును ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలతో పాటు అందరు భాగస్వాములకు తగిన సమయాన్ని ఇవ్వడం కోసం తిరిగి సలహాలను కోరుతోంది. ఆమేరకు ‘సాధారణ ప్రజలతో పాటు అందరు భాగస్వాముల నుంచి మోటార్‌ వాహనాల నిబంధనలపై ప్రతిపాదిత సవరణల విషయంలో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మరోసారి సలహాలు, స్పందనలను కోరుతోంది. ఈ ఏడాది మార్చి 18న ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశామ’ని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే తాజాగా మే 29న మరోసారి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ తేదీ నుంచి 60 రోజుల్లోగా సలహాలు, స్పందనలను మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శికి పంపవచ్చని తెలిపింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని