ఈ ఏడాది కొత్త పథకాలుండవు: ఆర్థిక మంత్రి
close
Published : 05/06/2020 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఏడాది కొత్త పథకాలుండవు: ఆర్థిక మంత్రి

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశంలో కొవిడ్‌-19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్’‌, ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అభియాన్‌’ తదితర ప్రత్యేక పథకాలకు మాత్రమే నిధుల కేటాయింపు ఉంటుందని ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ పథకాల పరిధిలోకి రాని ఏ ఖర్చులైనా.. ఆదాయ, వ్యయ విభాగం అనుమతి పొందాలని సీతారామన్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే బడ్జెట్‌ ఆమోదం పొందిన ఇతర పథకాలను మార్చి 31,2021 వరకు నిలిపివేస్తున్నట్లు మంత్రి వివరించారు. అంతేకాకుండా కొత్త పథకాలకు నిధులు కేటాయించాలంటూ విజ్ఞప్తులు పంపొద్దని ఇతర మంత్రిత్వ శాఖలకు ఆర్థికశాఖ స్పష్టం చేసింది.

ప్రస్తుతం 2,26,770 కరోనా కేసులతో భారత్‌ ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. ఇక మరణాల సంఖ్యలో 12వ స్థానంలో, యాక్టివ్‌ కేసుల విషయంలో ఐదో స్థానంలో కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడి కోసం దీర్ఘకాలం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ప్రభావంతో.. ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. వివిధ రాష్ట్రప్రభుత్వాలు కూడా ఖర్చులపై కోతలు విధిస్తున్నాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. పరిమితంగా ఉన్న వనరులను మారుతున్న ప్రాధాన్యాలకు అనుగుణంగా విచక్షణతో వినియోగించాల్సి ఉంటుందని ఆర్థికశాఖ నేటి ప్రకటనలో తెలిపింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని