అనార్కలీ.. వెబినార్‌ పూర్తయిపోయింది
close
Updated : 05/06/2020 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనార్కలీ.. వెబినార్‌ పూర్తయిపోయింది

వెబినార్‌పై అసంతృప్తి చెందిన ట్రాక్టర్‌ టైకూన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో అవకాశం ఉన్నవారు ఇంటి నుంచే ఆఫీసు పనులు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు కార్యాలయ సమావేశాలు, చర్చలు కూడా వెబినార్‌ (ఆన్‌లైన్‌)లోనే చేయడం ఎక్కువైంది. అయితే ఈ పద్ధతి కొందరికి నచ్చకపోయినా తప్పని పరిస్థితుల్లో ఇదే అవలంబిస్తున్నారు. వీరిలో మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్రా కూడా ఉన్నారు. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఆనంద్‌ మహీంద్రా వెబినార్‌పై ట్విటర్‌లో బహిరంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వెబినార్‌ అనే పదాన్ని డిక్షనరీలో నుంచి తీసేయడానికి ఏదైనా పిటిషన్‌ వేయడానికి సాధ్యమౌతుందా? అని ప్రశ్నిస్తూ తీవ్ర అసంతృప్తిని చాటుకున్నారు.

ఇది కాస్త సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయంతో ఏకీభవిస్తూ చాలామంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఆయన మరో ట్వీట్‌ చేశారు. వెబినార్‌పై తాను వ్యక్తం చేసిన అసంతృప్తిని గమనించిన ఎంతో మంది మిత్రులు తనతో ఈ ఫొటోను పంచుకున్నారంటూ ‘మొఘల్‌ ఎ ఆజం’ సినిమాలోని ఫొటోను జతచేశారు. ‘వెబినార్‌ కోమా’ లాంటి కొత్త అనారోగ్య పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోందని ఛలోక్తి విసిరారు. ఆ ఫొటోలో అనార్కలీని నటుడు సలీం నిద్రలేపే సన్నివేశాన్ని సూచిస్తూ.. ‘ఉటో అనార్కలీ.. వెబినార్‌ ఖతం హూఆ (వెబినార్‌ అయిపోయింది... ఇక నిద్రలేవు అనార్కలీ)’ అంటూ ఉన్న పదాలు నవ్వులు తెప్పిస్తున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కార్యాలయాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో ఇక వెబినార్‌ల జంఝాటం ఉండకపోవచ్చని ఆనంద్‌ మహీంద్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని