పట్టణ నిరుద్యోగ రేటులో భారీ తగ్గుదల
close
Published : 08/06/2020 21:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పట్టణ నిరుద్యోగ రేటులో భారీ తగ్గుదల

వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా మొదలైతే మరింత తగ్గుముఖం

ముంబయి: దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మే 31కి నాటికి 25.14 శాతంగా ఉన్న పట్టణ నిరుద్యోగ రేటు జూన్‌ 7కు 17.08 శాతానికి తగ్గింది. లాక్‌డౌన్‌ అమలు చేసిన తర్వాత అతి తక్కువ రేటు ఇదేనని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) నివేదిక ద్వారా తెలిసింది.

జాతీయ నిరుద్యోగ రేటు 17.51%, గ్రామీణ నిరుద్యోగ రేటు 17.71 శాతంతో పోలిస్తే ప్రస్తుతం పట్టణ రేటు తక్కువగా ఉండటం గమనార్హం. షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు సహా వ్యాపరాలన్నీ మొదలైతే ఇది మరింత తగ్గుముఖం పడుతుందని సీఎంఐఈ అంచనా వేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గిరాకీ తగ్గడంతో ఎంఎస్‌ఎంఈలు ఉద్యోగాల్లో కోతలు విధించే అవకాశముందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రామీణ నిరుద్యోగిత పెరగడంతో ఉపాధి హామీకి  డిమాండ్‌ పెరుగుతుందని భావిస్తున్నారు.

సీఎంఐఈ ప్రకారం పట్టణ నిరుద్యోగ రేటు ప్రస్తుతం 11 వారాల కనిష్ఠానికి చేరుకుంది. ప్రధాని నరేంద్రమోదీ లాక్‌డౌన్‌ ప్రకటించకముందు మార్చి 22 నాటికి ఇది 17.08%గా ఉంది. అయితే మే31 నాటికి 30.93-21.45% మధ్యలో ఊగిసలాడింది. ఇక దేశవ్యాప్త నిరుద్యోగ రేటు మే 31కి 20.19% ఉండగా ప్రస్తుతం 17.51 శాతానికి చేరుకుంది. ప్రభుత్వం మౌలిక ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే గ్రామీణ నిరుద్యోగ రేటు తగ్గుముఖం పడుతుందని నిపుణులు అంటున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని