పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయ్‌..
close
Updated : 11/06/2020 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయ్‌..

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు రెక్కలొచ్చాయ్‌. వరుసగా ఐదో రోజూ ధరలు పెరిగాయి. గురువారం లీటర్‌ పెట్రోల్‌పై 60 పైసలు, డీజిల్‌పై 60 పైసలు చొప్పున పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. తాజా పెరుగుదలతో దేశ రాజధాని నగరం దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.73.40 నుంచి రూ.74కి పెరగ్గా.. లీటరు డీజిల్‌ ధర రూ.71.62 నుంచి రూ.72.22కి పెరిగింది. దేశంలో ఆదివారం నుంచి వరుసగా పెట్రోల్‌ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. గత ఐదు రోజుల్లో కలిపి లీటరు పెట్రోల్‌పై రూ.2.74, డీజిల్‌పై రూ.2.83ల చొప్పున ధర పెరగడం గమనార్హం.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని