పదో రోజూ పెట్రో మోత!
close
Published : 16/06/2020 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పదో రోజూ పెట్రో మోత!

పదిరోజుల్లో పెట్రోల్‌పై రూ.5.47, డీజిల్‌పై రూ.5.80 పెంపు
ధరలు తగ్గించాలని ప్రధానికి సోనియా లేఖ

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం పెట్రోల్‌పై 47పైసలు, డీజిల్‌పై 57పైసలు పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు ధరలను సవరించాయి. ఇలా వరుసగా గత పదిరోజులుగా ఈ ధరలు పెరగడం గమనార్హం. దీంతో దేశ రాజధానిలో నిన్న పెట్రోల్‌ రూ.76.26 ఉండగా ఈరోజుకు రూ.76.73కి చేరింది. ఇక డీజిల్‌ ధర రూ.75.19కి పెరిగింది. ఇలా పదిరోజుల వరుస పెంపుతో (ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ధర ప్రకారం) పెట్రోల్‌పై దాదాపు రూ.5.47 పెరగగా, డీజిల్‌పై రూ.5.80 పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పెరుగుదల ప్రభావం ఉంటుంది. ఎల్‌పీజీ ధరలే కాకుండా విమానాల్లో వినియోగించే ఎవియేషన్‌ ఇంధనం ధరలు కూడా పెరిగాయి. మంగళవారం నాటికి దేశంలో మెట్రో నగరాల్లో ఆయిల్‌ ధరలు ఇలా ఉన్నాయి. 
నగరం    పెట్రోల్‌    డీజిల్‌
దిల్లీ       76.73    75.19
కోల్‌కతా   78.55    70.84
ముంబయి 83.62    73.75
చెన్నై      80.37    73.17
ధర రూపాయల్లో(ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకారం..)

ధరల పెంపుపై సోనియా మండిపాటు..

లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కసారిగా పెరగడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పదిరోజుల నుంచి వీటి ధరలు క్రమంగా పెంచడం పూర్తిగా అవివేకం, అనాలోచిత చర్య అని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. సంక్షోభ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులపై ఈ భారం మోపడం సరికాదన్నారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని