దిల్లీలో రూ.80 దాటిన డీజిల్‌ ధర
close
Published : 25/06/2020 07:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో రూ.80 దాటిన డీజిల్‌ ధర

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు కళ్లెం పడే సూచనలు కనిపించడంలేదు. వరుసగా 19వ రోజు కూడా చమురు ధరలు భగ్గుమన్నాయి. గురువారం డీజిల్‌పై 14 పైసలు, పెట్రోలుపై 16 పైసలు పెంచినట్టు  చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దిల్లీలో లీటరు డీజిల్‌ ధర 80 రూపాయలు దాటింది. పెట్రోల్‌ ధర రూ.79.92. 

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో స్థానిక పన్నులు/వ్యాట్‌లలో వ్యత్యాసం వల్ల ఈ రెండు ఇంధనాల ధరలు దిల్లీలో కన్నా ఎక్కువగానో లేదా తక్కువగానో ఉంటున్నాయి. తాజా సవరణతో ఇతర నగరాల కన్నా దిల్లీలో డీజిల్‌ ధర అధికం కాగా పెట్రోల్‌ ధర మాత్రం తక్కువగా ఉంది. గత 19 రోజుల వరుస సవరణలతో లీటర్‌ డీజిల్‌ ధర రూ.10.63 మేర, లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.8.21 మేర పెరిగింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని