రిలయన్స్‌ కేజీ-డీ6 బ్లాక్‌లో ఉత్పత్తి మళ్లీ వాయిదా
close
Published : 29/06/2020 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిలయన్స్‌ కేజీ-డీ6 బ్లాక్‌లో ఉత్పత్తి మళ్లీ వాయిదా

దిల్లీ: తూర్పు తీరాన ఉన్న కేజీ-డీ6 బ్లాక్‌లో రెండో దఫాలో కనుగొన్న క్షేత్రాల నుంచి ఉత్పత్తి ప్రారంభాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మళ్లీ వాయిదా వేసింది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ వల్ల తలెత్తిన ఇబ్బందులతో సెప్టెంబరు లేదా అక్టోబరుకు ఉత్పత్తిని వాయిదా వేసినట్లు కంపెనీ తెలిపింది. కృష్ణా గోదావరి బ్లాక్‌లో ఆర్‌-సిరీస్‌ క్షేత్రాల్లో ఉత్పత్తిని మేలో ప్రారంభించాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భాగస్వామి సంస్థ బీపీ పీఎల్‌సీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ వల్ల ప్రజల కదలికలు, వస్తు రవాణాపై ఆంక్షల నేపథ్యంలో దాన్ని జూన్‌ చివరకు వాయిదా వేయగా.. తాజాగా అది అక్టోబరుకు వెళ్లింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మధ్య నాటికి ఉత్పత్తిని వాయిదా వేసినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. కేజీ-డీ6లో కనుగొన్న క్షేత్రాల్లో దాదాపు 3 లక్షల క్యూబిక్‌ అడుగుల నిక్షేపాలను వెలికితీయడంపై 2019-20లో దృష్టిపెట్టామని కంపెనీ వెల్లడించింది. కేజీ-డీ6 బ్లాక్‌లో ఆర్‌-క్లస్టర్‌, శాటిలైట్స్‌, ఎంజే పేరుతో మూడు క్షేత్రాలను రిలయన్స్‌, బీపీ 2022 నాటికి అభివృద్ధి చేయనున్నాయి.
మొత్తం మూడు ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైతే.. 2023-24 నాటికి రోజుకు దాదాపు 30 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల గరిష్ఠ ఉత్పత్తి సాధిస్తామని అంచనా వేస్తోంది. ప్రస్తుతం భారత్‌ మొత్తం సహజవాయువు ఉత్పత్తిలో ఇది మూడోవంతు కావడం గమనార్హం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని