రియల్‌మి ప్రచారకర్తగా సల్మాన్‌ 
close
Published : 26/02/2020 22:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రియల్‌మి ప్రచారకర్తగా సల్మాన్‌ 

న్యూదిల్లీ: స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి ప్రచారకర్తగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ను నియమించింది.  ఈ విషయాన్ని బుధవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయన రియల్‌మి6, రియల్‌మి 6 ప్రోకు ప్రచారకర్తగా ఉంటారు. ‘సల్మాన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న మాస్‌ ఇమేజ్‌ తమ బ్రాండ్‌కు బాగా  ఉపయోగపడుతుంది. ఆయన రాకతో మా కంపెనీ థీమ్‌ అయిన ‘డేర్‌ టూ లీప్‌’ బలం చేకూరుతుంది. రియల్‌మి 6లో స్టైల్‌, ఎడ్జ్‌ వంటి ఆకర్షణలు ఉన్నాయి. ఇది కచ్చితంగా వినియోగదారులను ఆకర్షిస్తుంది’ అని  రియల్‌మి వైస్‌ ప్రెసిడెంట్‌, భారతీయ విభాగం సీఈవో మాధవ్‌ సేత్‌ తెలిపారు. 
మార్చి 5వ తేదీన రియల్‌మి6 విడుదల చేయనున్నారు. ప్రస్తుతం 2019 లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న స్మార్ట్‌ఫోన్ల తయారీ బ్రాండ్లలో రియల్‌మి ఉంది. ప్రస్తుతం భారతీయ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో నాలుగో స్థానంలో, ప్రపంచ మార్కెట్లో ఏడో స్థానంలో ఉంది.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని