మార్కెట్లోకి ఒప్పో ఏ31(2020)
close
Published : 27/02/2020 18:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లోకి ఒప్పో ఏ31(2020)

దిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో మరో బడ్జెట్‌ మొబైల్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. ఒప్పో ఏ31(2020) మొబైల్‌ను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. 2015లో ఈ సంస్థ నుంచి విడుదలైన ఏ31కు అనేక మార్పులు జోడించి ఏ31(2020)ను తయారుచేశారు. దీనికి ట్రిపుల్‌ కెమెరా ప్రత్యేక ఆకర్షణ. స్టోరేజీ ఆధారంగా రెండు వేరియంట్లలో లభించనున్న ఈ మొబైల్‌ ప్రారంభ ధర రూ.11,490గా సంస్థ నిర్ణయించింది. 

ఒప్పో ఏ31(2020) ధర:

ఒప్పో ఏ31(2020) మొబైల్‌ను 4జీబీ/64జీబీ, 6జీబీ/128జీబీ స్టోరేజీ సామర్థ్యంతో రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెస్తున్నారు. 4జీబీ/64జీబీ వేరియంట్‌ ధర రూ.11,490, 6జీబీ/128జీబీ వేరియంట్‌ ధర రూ.13,990గా సంస్థ నిర్ణయించింది. మొదటిది ఫిబ్రవరి 29న, రెండవది మార్చి రెండో వారంలో ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ వెల్లడించింది. మిస్టరీ బ్లాక్‌, ఫాంటసీ వైట్‌ కలర్‌లలో ఈ ఫోన్లు లభిస్తాయని తెలిపింది. 

యస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా ఈ ఫోన్‌ కొనుగోలు చేసే వారికి 5శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈఎంఐలో తీసుకుంటే ఐసీఐసీఐ కూడా 5శాతం క్యాష్‌బ్యాక్‌ ప్రకటిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ కొనుగోలుపై రూ.7వేల విలువైన జియో ఆఫర్లను పొందవచ్చని సంస్థ తెలిపింది. 

ఫీచర్లు:
ఒప్పో ఏ31(2020) ఆండ్రాయిడ్‌ 9పై, కలర్‌ ఓఎస్‌ 6.1.2 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. 6.5 అంగుళాల హెచ్‌డీ+(720X1,600పిక్సెల్‌) డిస్‌ప్లే అందిస్తున్నారు. అక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో పీ35 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ అందిస్తున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే.. వెనక వైపున ట్రిపుల్‌ కెమెరా సదుపాయాన్ని కల్పించారు. 12 మెగాపిక్సెల్‌, 2 ఎంపీ డెప్త్‌ షూటర్‌, మరొకటి 2ఎంపీ మాక్రో కెమెరా అందిస్తున్నారు. ముందువైపు సెల్ఫీకోసం 8మెగాపిక్సెల్‌ కెమెరా అమర్చారు. 4,230ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉంది. వీటితో పాటు మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, జీపీఎస్‌/ఏజీపీఎస్‌, 4జీ వీఓఎల్టీఈ కనెక్టివిటీ సదుపాయాల్ని అందిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని