భారత మార్కెట్లోకి ‘రెనో 3ప్రో’ 
close
Published : 02/03/2020 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత మార్కెట్లోకి ‘రెనో 3ప్రో’ 

దిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో మరో మోడల్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. ‘రెనో 3ప్రో’ పేరిట సరికొత్త మొబైల్‌ను సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు బ్యాక్‌సైడ్‌ 64 మెగాపిక్సెల్‌ సహా మరో మూడు కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నట్లు సంస్థ వెల్లడించింది. స్టోరేజీ ఆధారంగా రెండు వేరియంట్లలో ఈ మొబైల్‌ అందుబాటులో రానున్నట్లు తెలిపింది. 

రెనో 3ప్రో 128జీబీ, 256జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభించనుంది. 8జీబీ/128జీబీ ధర రూ.29,990గా నిర్ణయించగా ఇది మార్చి 6 నుంచి ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. 256జీబీ వేరియంట్‌ ధర రూ.32,990 ఉంటుందని వెల్లడించింది.. కానీ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ రెండు వేరియంట్లు ఆరోరల్‌ బ్లూ, మిడ్‌నైట్‌ బ్లాక్‌, స్కై వైట్‌ కలర్‌లో లభిస్తాయని పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులతో ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే 10శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చని సంస్థ తెలిపింది. దీంతో పాటు సంస్థ ఎంకో వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌పై రూ.2వేల ఆఫర్‌ ప్రకటిస్తోంది. 

ఒప్పో ‘రెనో 3ప్రో’ ఫీచర్లు
ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్‌ 10, కలర్‌ ఓఎస్‌ 7 సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 6.7 అంగుళాల, ఫుల్‌ హెచ్‌డీ+(1080x2400) సూపర్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే కలిగి ఉంది. 8జీబీ ర్యామ్‌తో కూడిన, అక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పీ95 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ అందిస్తున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే.. బ్యాక్‌సైడ్‌ మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయి. 64 మెగాపిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌, 13ఎంపీ టెలిఫొటో షూటర్‌, 8ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌, 2ఎంపీ మోనో సెన్సార్‌ కెమెరా అందిస్తున్నారు. సెల్ఫీ కోసం 44ఎంపీ, 2 ఎంపీ సామర్థ్యంతో డ్యుయల్‌ హోల్‌పంచ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు 4జీ వోల్టే, వైఫై 802.11ఏసీ, బ్లూటూత్‌, జీపీఎస్‌/ఏ-జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌ కనెక్టివిటీ, ఆన్‌స్క్రీన్‌ ఫింగర్‌ప్రింట్‌ సదుపాయాన్ని అందిస్తున్నారు. 4,025 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీని మొబైల్‌కు జోడించారు. 

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని