close

తాజా వార్తలు

వ్రతం మొదలు పెట్టిన నయనతార

ఆలయంలో నయనతార, విఘ్నేశ్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: రేడియో జాకీగా ఉంటూ సినిమాలను విశ్లేషించి.. ఆ తర్వాత వెండి తెరపై హాస్య నటుడిగా అడుగుపెట్టి.. ఇప్పుడు కథానాయకుడిగా నటిస్తున్నారు ఆర్‌జే బాలాజీ. ఇటీవల ఆయన నటించిన ‘ఎల్‌కేజీ’ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆయన దర్శకుడిగానూ మారారు. స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్‌’. ఇందులో అమ్మవారి పాత్ర పోషిస్తోంది నయనతార. కొన్నిరోజుల క్రితమే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. అప్పటినుంచే నయనతార వ్రతాన్ని మొదలు పెట్టారని బాలాజీ చెప్పారు. అయితే ఆ ప్రకటన తర్వాత నయనతార విదేశీ యాత్రలు, పార్టీల్లో పాల్గొన్న ఫొటోలు బయటకు రావడంతో ‘ఇదేనా.. వ్రతమంటే’ అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆమె వాస్తవానికి మంగళవారం నుంచే ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనికోసం ఆమె తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి సోమవారం రాత్రి కన్యాకుమారిలోని భగవతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి వ్రతం ప్రారంభించారు. ఆలయానికి నయనతార రావడంతో ఆమెను చూడడానికి భక్తులు ఎగబడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం తిరుచెందూర్‌ సుబ్రహ్మణ్యస్వామిని నయనతార, విఘ్నేశ్‌లు దర్శించుకున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.