తన కొత్త చిత్రం పేరును ప్రకటించిన మెగాస్టార్‌
close
Updated : 02/03/2020 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తన కొత్త చిత్రం పేరును ప్రకటించిన మెగాస్టార్‌

హైదరాబాద్‌: తన 152వ చిత్రం పేరును స్వయంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు మెగాస్టార్‌ చిరంజీవి. ప్రముఖ నటుడు బ్రహ్మజీ కుమారుడు సంజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’ ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం గురించి చెప్పే క్రమంలో చిత్రం పేరును ‘ఆచార్య’గా ప్రకటించించారు. దీంతో అక్కడున్న అభిమానులు కేరింతలతో హోరెత్తించారు. దీంతో చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఎక్కడ మిస్సయ్యానో తెలియడం లేదు. కొరటాల శివ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చిత్రం టైటిల్‌ను లాంఛ్‌ చేద్దాం అనుకున్నారు. కానీ నా నోటి ద్వారా లాంఛ్‌ అయిపోయింది. సారీ శివ ఏమనుకోవద్దు. మంచి మంచి వార్తలు ఆపుకోలేం. వాటిని ఆపడం కూడా కరెక్టు కాదు’ అని అన్నారు. 

సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో తన 152వ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ చిత్రానికి కొరటాల ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని