కరోనాపై.. చిరు-నాగ్‌ పాట..చూశారా?
close
Published : 30/03/2020 00:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై.. చిరు-నాగ్‌ పాట..చూశారా?

హైదరాబాద్‌: ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న మహమ్మారి కరోనా భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1024 మందికి ఈ వైరస్‌ సోకగా.. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన లాక్‌డౌన్‌ను అన్ని రాష్ట్రాలూ పక్కాగా అమలు చేస్తున్నప్పటికీ.. రోజు రోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  ఈ నేపథ్యంలో సహాయ కార్యక్రమాలను చేపట్టేందుకు కొందరు ప్రభుత్వాలకు విరాళాలిస్తుండగా.. మరి కొందరు స్వచ్ఛందగా సేవలందించేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు సినిమా కార్మికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్‌ ఛారిటీ పేరిట సినీ పరిశ్రమ వర్గాల నుంచి విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే.  దీనిపై మరింత అవగాహన కల్పించేలా సంగీత దర్శకుడు కోటి ఓ పాటను స్వరపరిచారు. తాజాగా దీనిని అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జునలతోపాటు యువ కథానాయకులు వరుణ్‌తేజ్‌, సాయితేజ్‌ కలిసి ఆలపించారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తూ.. ఈ నలుగురూ పాడిన పాట పలువురిని ఆకట్టుకుంటూ అవగాహన కల్పిస్తోంది.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని