చరవాణి స్నేహం.. ప్రేమ పేరుతో మోసం
close
Updated : 01/11/2020 09:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చరవాణి స్నేహం.. ప్రేమ పేరుతో మోసం

యువతి అదృశ్యం... కేసు నమోదు

చరవాణి స్నేహం.. ప్రేమ పేరుతో మోసం

ఆళ్లగడ్డ గ్రామీణ: మోసగాడి ప్రేమలో పడి ఓ యువతి అతని వెంట వెళ్లిపోయిన ఘటన అహోబిలంలో జరిగింది. యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వరప్రసాద్‌ తెలిపారు. ఈనెల 26న ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదని తండ్రి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై చప్పొరు. ఆ మేరకు విచారణ చేస్తున్నట్లు ఏఎస్సై వెంకట్రామిరెడ్డి తెలిపారు.

మోసగాడి వలలో.. 

కొంత కాలం క్రితం పని మీద కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లిన యువతి ఆటోలో చరవాణి మర్చిపోగా, ఆటోవాలా తిరిగి చరవాణి అందజేశాడు. వారి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆటోవాలా తన స్నేహితుడు శివశంకర్‌ బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడని, రూ.లక్షల జీతం వస్తోందని యువతికి చెప్పాడు. దీంతో ఆ యువకుడితో చరవాణిలో పరిచయం పెంచుకోగా, అది కాస్త ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడిని నమ్మి వెంట వెళ్లింది. ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలియడంతో అహోబిలం అబ్బాయితో పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా యువతిని తీసుకెళ్లి పోయాడు. అయితే ఆ యువకుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇది వరేక మరో ఇద్దరు అమ్మాయిలను ఇలా మోసం చేసినట్లు తెలిసింది. అమ్మాయి తరఫు బంధువులు ఆరా తీయగా అతడి నిజ స్వరూపం బయటపడింది. మోసగాడి చెర నుంచి కాపాడాలని యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని