close

తాజా వార్తలు

సుభాస్కరన్‌ బయోపిక్‌కు పోటీ

సుభాస్కరన్‌ను సత్కరిస్తున్న మణిరత్నం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని ‘కత్తి’ చిత్రంతో నిర్మాతగా అడుగుపెట్టారు లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాస్కరన్‌. ఆ తర్వాత ‘కోలమావు కోకిల’, ‘సెక్క చివంద వానం’, ‘వడ చెన్నై’, ‘2.ఓ’, ‘కాప్పాన్‌’ చిత్రాలు నిర్మించారు. ఇప్పుడు రజనీకాంత్‌ హీరోగా ‘దర్బార్‌’, ‘మాఫియా’, ‘రాంగి’ చిత్రాలు నిర్మిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇంగ్లాండులో స్థిరపడిన ఇతను 24 దేశాల్లో తన లైకా సంస్థ ద్వారా మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలను అందిస్తున్నారు. ఇదిలా ఉండగా సుభాస్కరన్‌ పలు దేశాల్లో చేసిన సేవలను ప్రశంసిస్తూ, స్ఫూర్తిదాయకమైన ఆయన జీవితాన్ని అభినందిస్తూ మలేషియాకు చెందిన ఏఐఎంఎస్‌టీ వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. చెన్నైలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో సంబంధిత వర్గాలు ఆయనకు డాక్టరేట్‌ అందజేశాయి. ఈ కార్యక్రమంలో సీనియర్‌ దర్శకుడు మణిరత్నం, ఏఆర్‌ మురుగదాస్‌, సుభాస్కరన్‌ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ ‘సుభాస్కరన్‌ జీవితాన్ని ఓ సినిమాగా తెరకెక్కించాలని అనుకుంటున్నా. ఇలాంటి వ్యక్తి జీవితం చాలా ఆదర్శవంతంగా ఉంటుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వచ్చారు మురుగదాస్‌. అప్పటికే మణిరత్నం ప్రసంగం పూర్తయింది. ఆ తర్వాత మురుగదాస్‌ మాట్లాడుతూ ‘నాకు ‘కత్తి’ సినిమా తెరకెక్కించేటప్పుడు సుభాస్కరన్‌ గురించి పెద్దగా తెలియదు. ఆ తర్వాతే అర్థమైంది. ఓ సారి లండన్‌ వెళ్లినప్పుడు ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం గురించి తెలుసుకున్నా. కఠోర శ్రమతో ఆయన ఈ స్థాయికి ఎదిగారు. ఆయన జీవితాన్ని ఓ సినిమాగా తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తన మనసులోని మాటను’ బయట చెప్పారు. దీంతో మణిరత్నం, సుభాస్కరన్‌లు పగలబడి నవ్వారు. ఆయన బయోపిక్‌ తీయడానికి ఇద్దరు దర్శకులు పోటీపడటం ఆశ్చర్యంగా అనిపించింది. మరి ఆ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారో వేచి చూడాలి.

జ్ఞాపిక అందజేస్తున్న మురుగదాస్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.