విడుదలకు సిద్ధమవుతున్న త్రిష మూవీ 
close
Updated : 13/01/2020 08:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విడుదలకు సిద్ధమవుతున్న త్రిష మూవీ 

త్రిష

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘96’ చిత్రం తర్వాత త్రిష ‘పరమపదం విళైయాట్టు’ చిత్రం కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. కథానాయిక నేపథ్య చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. నందా, రిచర్డ్‌ రిషి, వేల.రామమూర్తి, ఏఎల్‌ అళగప్పన్‌ ఇతర తారాగణం. తిరుజ్ఞానం ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో దీనిని రూపొందించారు. గత ఏడాదే ఈ సినమాను విడుదల చేయాలని చిత్రవర్గాలు భావించాయి. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 31న తప్పకుండా సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. 200 పైగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై త్రిష భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు అమ్రీష్‌ సంగీతం సమకూర్చారు. జినేష్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇదిలా ఉండగా త్రిష నటించిన ‘గర్జన’, ‘రాంగి’ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని