శతక్కొట్టిన సరిలేరు నీకెవ్వరు
close
Published : 16/01/2020 04:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శతక్కొట్టిన సరిలేరు నీకెవ్వరు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిన సరిలేరు నీకెవ్వరు.. రికార్డుల వేటలో తగ్గేదే లేదంటోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్లలో దూసుకెళుతోంది. మహేశ్‌ హీరోగా నటించిన భరత్‌ అను నేను, మహర్షి సినిమాలు విజయాలు సాధించిన తర్వాత వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 11న విడుదలైంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అభిమానులను అలరిస్తూ రికార్డుల సునామీ సృష్టిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.103కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా విడుదలైన మరునాడే అల్లు అర్జున్‌ నటించిన అలవైకుంఠపురములో విడుదలయింది. అయినా మహేశ్‌ సినిమా కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్‌ వద్ద వందకోట్ల మార్కు దాటిన సందర్భంగా ఆ సినిమా బృందం తన ఆనందాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌.. బాక్సాఫీస్‌ హంటర్‌..’ అంటూ ఓ పోస్టు పెట్టింది. అంతేకాదు అభిమానుల కోసం ఓ ప్రోమో సైతం విడుదల చేసింది. దానిని బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌ ప్రోమో అంటూ పేర్కొంది. అందులో ‘ఫారెస్టా.. వెళ్లినవాడేమైనా టూరిస్టా.. వేటగాడు’ అంటూ విజయశాంతి చెప్పిన డైలాగ్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని