close

తాజా వార్తలు

పశివేదలలో షూటింగ్‌ సందడి

గోపీచంద్‌, భూమికలపై పలు సన్నివేశాల చిత్రీకరణ

పశివేదల గ్రామంలో షూటింగ్‌ సందడి

పశివేదల (కొవ్వూరు పట్టణం), న్యూస్‌టుడే : శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానరుపై సంపత్‌నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌ సందడిగా సాగింది. సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కబడ్డీ ఆట నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. హీరో గోపీచంద్‌ అక్కగా నటిస్తున్న భూమికతో సన్నివేశం, కబడ్డీ కోచ్‌గా గోపీచంద్‌ క్రీడాకారిణులతో కలసి వెళ్లే సన్నివేశాలను ఆకట్టుకునేలా చిత్రీకరించారు. పశివేదల గ్రామంలో చెరకు బట్టీ వద్ద, ఆ పరిసరాల్లో షూటింగ్‌ కొనసాగింది. పశివేదలకు చెందిన నిర్మాత శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచే విధంగా ఈ చిత్రం నిర్మితమవుతోందన్నారు. కుటుంబ బంధాలు, ప్రేమ, సెంటిమెంటు సన్నివేశాలతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తయిందన్నారు. కొవ్వూరు, పశివేదలతో పాటు పలు గ్రామాల ప్రజలు షూటింగ్‌ను తిలకించేందుకు రావడంతో సందడి నెలకొంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.