మేలో పవర్‌స్టార్‌ చిత్రం విడుదల: దిల్‌రాజు
close
Published : 09/02/2020 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేలో పవర్‌స్టార్‌ చిత్రం విడుదల: దిల్‌రాజు

తిరుమల: తిరుమల శ్రీవారిని ‘జాను’ చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నటి సమంతా, హీరో శర్వానంద్‌, నిర్మాత దిల్‌ రాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ‘జాను’ చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉందని, స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని నిర్మాత దిల్‌ రాజు వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌, సుధీర్‌-నానిలతో నిర్మిస్తున్న చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
‘‘జాను చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించడం సంతోషంగా ఉంది. తమిళంలో విడుదలైనప్పుడు.. తెలుగులో వర్కవుట్‌ అవుతుందా అని కామెంట్స్‌ వచ్చాయి. కానీ, శర్వానంద్‌, సమంత మంచి నటనతో చిత్రాన్ని విజయవంతం చేశారు. నాని, సుధీర్‌బాబు సినిమా మార్చి 25న ఉగాది నాడు విడుదల కాబోతోంది. పింక్‌ సినిమా షూటింగ్‌ కొనసాగుతోంది. పవన్‌ కల్యాణ్ మేలో దర్శనమిస్తారు. మార్చిలో ఫస్ట్‌లుక్‌ .. మేలో ‘పింక్‌’ సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అని దిల్‌ రాజు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని