సినీ నటుడు శ్రీకాంత్‌కు పితృవియోగం
close
Updated : 17/02/2020 14:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినీ నటుడు శ్రీకాంత్‌కు పితృవియోగం

హైదరాబాద్‌ : ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి మేక పరమేశ్వరరావు(70) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలలుగా స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

ఇవాళ మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1948 మార్చి 16న కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవ పాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీలక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.

శ్రీకాంత్‌ను పరామర్శించిన చిరంజీవి

నటుడు శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు మృతిచెందారన్న వార్త తెలుసుకుని పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి కూడా శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లి పరమేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని