వాళ్లే నా పంచప్రాణాలు: నితిన్‌
close
Published : 18/02/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లే నా పంచప్రాణాలు: నితిన్‌

హైదరాబాద్‌లో ‘భీష్మ’ ప్రీరిలీజ్‌ వేడుక

హైదరాబాద్‌: అదృష్టం అవగింజంత ఉంటే.. దురదృష్టం దుబ్బకాయంత ఉంది అంటూ ఆ దురదృష్టాన్ని బద్దలుకొట్టేందుకు ‘భీష్మ’గా అభిమానుల ముందుకు వస్తున్నాడు నితిన్‌. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. నితిన్‌ సరసన రష్మిక కనిపించనుంది. సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి సంగీతం అందించారు. ఇప్పటికే పాటలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్‌ వేడుకను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా బృందం చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ గ్యాప్‌ ఎందుకొచ్చిందంటే..
హీరో నితిన్‌ మాట్లాడుతూ.. ‘నా లైఫ్‌లో పంచప్రాణాలంటే మా అమ్మ, నాన్న, అక్క. ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్ శ్రీనివాస్‌. ఇప్పుడు నాకు పెళ్లి కాబోతోంది కాబట్టి నా లైఫ్‌లోకి రాబోతున్న నా భార్య నా ఆరోప్రాణం. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నాకు టార్చ్‌ బేరర్‌ లాంటి వాళ్లు. చివరి సినిమాకు ఈ సినిమాకు ఏడాదిన్నర గ్యాప్‌ వచ్చింది. ఈ గ్యాప్‌ ఎందుకొచ్చిందంటే.. మంచి స్టోరీ కోసం ఎదురు చూడటం. సినిమా సెకండ్‌ హాఫ్‌లో అద్భుతమైన ఒక ఫైట్‌ ఉంటుంది. ఆ టైంలో ఆర్‌ఆర్‌ కూడా బాగా ఇచ్చారు. ఆ ఫైట్‌ చూసేటప్పుడు అభిమానులకు గూస్‌బంబ్స్‌ రావడం పక్కా. రష్మిక కూడా బాగా చేసింది. వాట్టే బ్యూటీ సాంగ్‌లో ఆమె తప్ప ఎవరున్నా అంత పేరు వచ్చేది కాదు. ప్రొడ్యూసర్‌ చినబాబు, వంశీ.. వీళ్లిద్దరితో కలిసి మొదటి సినిమా ‘అఆ’. ఇది రెండోది. మూడో సినిమా కూడా ఇప్పటికే ప్రారంభమైంది. నాలుగో సినిమా కోసం వంశీగారు స్కెచ్‌ గీస్తున్నారు. షూటింగ్‌లో చాలా సహకరించారు. ఇది పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. ఫిబ్రవరి 21న థియేటర్లలో హంగామా చేసేందుకు సిద్ధంగా ఉండండి’

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. 
‘నితిన్‌కు వాళ్ల అన్నయ్య పవన్‌కల్యాణ్‌ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయంతో ఉన్న రష్మిక.. భీష్మతో మరో విజయం తన ఖాతాలో వేసుకోబోతోంది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడాలంటే.. నాకు బాగా నచ్చిన రెండు అంశాలు. ఒకటి ఫైట్‌, మరోటి ‘వాట్టే బ్యూటీ’ పాట. ఈ సినిమా అభిమానులను కచ్చితంగా అలరిస్తుందని నమ్మకం ఉంది’ అని త్రివిక్రమ్‌ పేర్కొన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ.. సినిమాలో నవ్వులు పక్కా అని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. సినిమా పాటలన్నీ చాలా బాగా ఉన్నాయి. మహతి సంగీతంలో మణిశర్మ వారసుడని అని నిరూపించుకుంటున్నాడని అన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని