close
Array ( ) 1

తాజా వార్తలు

ఎన్టీఆర్‌ నోట..తెలుగు ‘కుట్టి స్టోరీ’ పాట

జూనియర్‌ ఎన్టీఆర్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘మాస్టర్‌’. అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఆయన సంగీతంలో ఇటీవల ‘కుట్టి స్టోరీ..’ అనే సింగిల్‌ ట్రాక్‌ను విడుదల చేశారు. విజయ్‌ పాడిన ఈ పాట ఊహించని స్థాయిలో ప్రేక్షకాధరణ పొందుతోంది. ముఖ్యంగా విజయ్‌ అభిమానులు దీన్ని వైరల్‌గా మార్చారు. పొడి పొడి ఆంగ్ల పదాలు, అందుకు తగ్గ బాణీతో రూపొందించిన ఈ పాట చిన్నారులను ఆకట్టుకుంటోంది. విజయ్‌ నటించిన చిత్రాలు కొంత కాలంగా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. అందులో భాగంగా ‘మాస్టర్‌’ సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయాలని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో విజయం పాడిన ఈ ‘కుట్టి స్టోరీ..’ పాటను తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ పాడనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల దీనికి సంబంధించి ఆయనతో చిత్రవర్గాలు చర్చించాయని, అందుకు తారక్‌ కూడా అంగీకరించారని సమాచారం. మరో వైపు విజయ్‌ అభిమానులు దీనిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.