బాలీవుడ్‌కు సూర్య కొత్త చిత్రం?
close
Published : 25/02/2020 07:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలీవుడ్‌కు సూర్య కొత్త చిత్రం?

చెన్నై: సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘సూరరై పోట్రు’. అపర్ణ బాలమురళి కథానాయిక. ఊర్వశి, మోహన్‌బాబు, జాకీష్రాఫ్‌, కరుణాస్‌ ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చారు. ఇటీవలే ఈ సినిమా సింగిల్‌ ట్రాక్‌ను విమానంలో విహరిస్తూ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా ఈ చిత్రం విడుదలవుతోంది. 
ఇదిలా ఉండగా ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గునీత్‌ మోంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్‌కు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. నటీనటులు, ఇతర సాంకేతిక కళాకారుల ఎంపిక పనులు జరుగుతున్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని