కమల్‌ హాసన్‌కు ‘లైకా’ బహిరంగ లేఖ
close
Published : 27/02/2020 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కమల్‌ హాసన్‌కు ‘లైకా’ బహిరంగ లేఖ

చెన్నై: వారం రోజుల క్రితం ‘భారతీయుడు 2’ షూటింగ్‌లో చోటు చేసుకున్న ప్రమాదం గురించి లైకా ప్రొడక్షన్స్‌ కమల్‌ హాసన్‌కు బహిరంగ లేఖ పంపించింది. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, భద్రతకు సంబంధించి కొన్ని షరతులకు అంగీకరిస్తేనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటానంటూ నిర్మాణ సంస్థకు హీరో కమల్ హాసన్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే. దానికి స్పందనగా లైకా సంస్థ కమల్‌కు ట్విటర్‌ వేదికగా బహిరంగ లేఖ పంపించింది.

‘షూటింగ్‌ సమయంలో జరిగిన క్రేన్‌ ప్రమాదం దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు సంస్థ తరఫున అనునిత్యం అందుబాటులో ఉంటున్నాం. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయంగా రూ.2కోట్లు ప్రకటించాం. గాయపడిన వాళ్లకు చికిత్స అందిస్తున్నాం. ఫిబ్రవరి 22కు ముందు నుంచే మేం ఈ చర్యలు చేపట్టాం. అవి మీ దృష్టికి రాకపోవడం వల్లే మీరు మాకు లేఖ రాశారని భావిస్తున్నాం. షూటింగ్‌ సమయంలోనూ అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నాం. అయితే, ప్రమాద సమయంలో మీరు కూడా అక్కడే ఉన్నారన్న విషయం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ప్రొడక్షన్‌ బీమాతో పాటు వ్యక్తిగత బీమాలు సకాలంలో వచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు వారికి అండగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం. మీరు కోరినవన్నీ మేం ముందే చేశాం. సినిమా షూటింగ్‌ పునఃప్రారంభిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం’ అని ఆ లేఖలో పేర్కొంది.

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని