శరవేగంగా అజిత్ మూవీ షూటింగ్‌
close
Published : 10/03/2020 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శరవేగంగా అజిత్ మూవీ షూటింగ్‌

అజిత్‌

కోడంబాక్కం : అజిత్‌ నటిస్తున్న ‘వలిమై’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. తదుపరి షెడ్యూల్‌ను కోల్‌కతాలో చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత స్పెయిన్‌లో తెరకెక్కిస్తారు. ఇదిలా ఉండగా అజిత్‌ నటించిన తొలి చిత్రం ‘అమరావతి’ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన భానుప్రకాశ్‌ కుమారుడు రాజ్‌ అయ్యప్ప ‘వలిమై’లో అజిత్‌కు తమ్ముడిగా నటిస్తున్నారు. ఇతను ఇప్పటికే అధర్వ నటించిన ‘100’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఇప్పుడు అజిత్‌ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా అజిత్‌కు జోడీగా హుమా ఖురేషి నటిస్తోంది. తెలుగు నటుడు కార్తికేయ ఇందులో విలన్‌ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఇంకా పలువురు ముఖ్యమైన నటులు కూడా ఇందులో నటిస్తున్నట్లు సమాచారం. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని