కోవిడ్‌పై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆరు సూత్రాలు
close
Published : 17/03/2020 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోవిడ్‌పై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆరు సూత్రాలు

హైదరాబాద్‌: కోవిడ్‌19 (కరోనా వైరస్‌) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు ఇప్పటి వరకూ ఏ మందు దొరకలేదు. కేవలం ముందస్తు జాగ్రత్త చర్యల ద్వారానే వైరస్‌ను నియంత్రించ వచ్చని వైద్యులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంతో పాటు పలువురు ప్రముఖులు సైతం పరిశుభ్రతపై పదేపదే అవగాహన కలిగిస్తున్నారు. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం ఇందుకు నడుం కట్టింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఒక వీడియో చేశారు. కోవిడ్‌ నుంచి దూరంగా ఉండేందుకు పాటించాల్సిన ఆరు సూత్రాలను అభిమానులతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి..
1. చేతులు మోచేతి వరకు సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి. ముఖ్యంగా బయటికి వెళ్లి వచ్చిన తర్వాత, భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి.
2. కౌగిలించుకోవడం, షేక్‌హ్యాండ్స్‌ మానేయాలి. కళ్లు తడుచుకోవడం, ముక్కు రద్దుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం వంటివి చేయకూడదు.
3. పొడిదగ్గు, జ్వరం, జలుబు ఉంటేనే మాస్కు వేసుకోండి.  తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డు పెట్టుకోండి.
4. జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకండి. మంచినీళ్లు ఎక్కువగా తాగండి. ఒకేసారి ఎక్కువగా తాగడం కంటే విడతల వారీగా తాగడం మంచింది. 
5. వాట్సాప్‌లో వచ్చే వార్తల్లో నిజం ఎంతో తెలియకుండా ఇతరులకు ఫార్వర్డ్‌ చేయకండి. దానివల్ల అనవసరంగా ఆందోళన పెంచినవారవుతారు. ఇది వైరస్‌కంటే ప్రమాదకరం. 
6. డబ్ల్యూహెచ్‌వో(ఆరోగ్య సంస్థ) వెబ్‌సైట్‌లో సూచనలు ఇస్తుంటారు వాటిని ఫాలో అవుదాం. కోవిడ్‌ను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం ఇచ్చే సలహాలను పాటిద్దాం.  మనల్ని మనమే కాపాడుకుందాం. పరిశుభ్రంగా ఉందాం.. సురక్షితంగా ఉందాం.

 


 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని