కరోనాపై అవగాహన కల్పిస్తున్న త్రిష
close
Updated : 21/03/2020 13:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై అవగాహన కల్పిస్తున్న త్రిష

త్రిష

చెన్నై: ప్రపంచవాన్ని వణికిస్తున్న కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నటి త్రిష ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. యునిసెఫ్‌ ఇండియా దౌత్య అధికారిగా ఆమె వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆమె మాట్లాడుతూ ‘కరోనా నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి. మీకు తుమ్ము, దగ్గు వస్తే వెంటనే కర్చీఫ్‌ లేదా టిష్యూ పేపర్‌ అడ్డుపెట్టుకోండి. వాడిన కర్చీఫ్‌, టిష్యూ పేపర్‌ను చెత్తకుప్పలో పడేసి మూసి ఉంచాలి. మీ కన్ను, ముక్కు, నోటిని అనవసరంగా తాకకండి. అప్పుడప్పుడు 20 సెకన్ల పాటు సోపుతో చేతులను శుభ్రం చేసుకోండి. జనం ఉన్న ప్రాంతానికి వెళ్లకండి. దగ్గు, జ్వరం ఉంటే ఇతరులతో మాట్లాడటం తగ్గించండి. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లండి. ఆ సమయంలో తప్పకుండా మాస్క్‌ను ధరించండని’ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ అవుతోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని