చిరు-నాగ్‌లకు మోదీ అభినందన
close
Published : 04/04/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు-నాగ్‌లకు మోదీ అభినందన

హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ తెలుగు రాష్ట్రాల్లోనూ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ స్టార్లు, సంగీత దర్శకులు, గాయకులు తమ పాటలతో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కథానాయకులు చిరంజీవి, నాగార్జునతోపాటు యువ కథానాయకులు సాయితేజ్‌, వరుణ్‌ తేజ్‌ ఓ పాటను ఆలపించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ తాజాగా ట్విటర్‌లో స్పందించారు. ‘‘ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. 

అందరం మన ఇళ్లల్లోనే ఉందాం.

అందరం సామాజిక దూరం పాటిద్దాం.

 కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం’’

అంటూ తెలుగులో ట్వీట్‌ చేశారు. #IndiaFightCorona అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా జత చేశారు.

లాక్‌డౌన్‌ కారణంగా రోజువారీ చిత్రీకరణలు నిలిచిపోవడంతో సినిమా కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సి.సి.సి) ఏర్పాటైంది. దీని కోసం పరిశ్రమ వర్గాల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. దీనికి చిత్రపరిశ్రమ నుంచి మంచి స్పందనే వస్తోంది. దీనిపై మరింత అవగాహన కల్పించేలా సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన పాటను చిరు, నాగ్‌, వరుణ్‌తేజ్‌, సాయితేజ్‌ ఆలపించారు.

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని