కరోనాపై పోరు.. వీరి రూటే వేరు
close
Updated : 24/09/2020 18:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై పోరు.. వీరి రూటే వేరు

తమదైన శైలిలో గాయకులు, కవులు, కళాకారుల అవగాహన 

యావత్తు ప్రపంచానికి సవాల్‌ విసురుతోన్న కరోనాపై పోరుకు కవులు కలాలకు పని చెబుతుంటే.. గాయకులు గళం విప్పుతున్నారు. వైరస్‌పై ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధానికి సై అంటూ కవులు, కళాకారులు గర్జిస్తున్నారు. తమదైన శైలిలో పాటలు పాడుతూ చైతన్యపరుస్తున్నారు. ఇంటి పట్టున ఉండాల్సిన అవశ్యకతను వివరిస్తున్నారు. సుప్రసిద్ద గాయకుల నుంచి చిన్నారుల వరకు కరోనాపై సమరానికి జై కొడుతున్నారు. 

* కొవిడ్‌19పై ‘ఈనాడు’ నిర్వహిస్తున్న కవిత్వ పోటీల్లో శనివారం ప్రథమ బహుమతి పొందిన ఓ కవితను ప్రఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటగా మలిచారు. అమలాపురానికి చెందిన యువ రచయిత తంగెళ్ల రాజగోపాల్‌ దీన్ని రచించారు. 

* కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలనే నేపథ్యంతో ప్రముఖ తెలుగు ర్యాపర్‌ చాగంటి ప్రణవ్‌ తనదైన శైలిలో ఓ పాటను రూపొందించారు. ‘లక్ష్మణరేఖ’ పేరుతో సాగే ఈ పాట సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. 

* సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించి మహమ్మారిని పారదోలాలని పేర్కొంటూ తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుడు పల్లె నరసింహ ఓ అద్భుత గీతాన్ని రచించారు. తనదైన శైలిలో పాడుతూ ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్నారు. 

* సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ కోసం 101 శతకాలు రచించిన భద్రాచలానికి చెందిన శతక కవి చిగురుమల్ల శ్రీనివాస్‌ కరోనాపై తన కలాన్ని ఎక్కుపెట్టారు. శతక శంఖారావాన్ని పూరించి కరోనా శతకాన్ని రచించారు.  

* ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ కొవిడ్‌-19ను తరిమి కొట్టాలంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ చిన్నారి స్వయంగా పాట రాసి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. 
 

 

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని