బాలీవుడ్‌ తారల వీడియోకి మోదీ ప్రశంస
close
Updated : 07/04/2020 18:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలీవుడ్‌ తారల వీడియోకి మోదీ ప్రశంస

కరోనాపై పోరులో గెలుస్తామన్న ప్రధాని

దిల్లీ: కరోనాపై పోరులో ప్రజలను అప్రమత్తం చేస్తూ సినీ తారలు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. తమదైన శైలిలో పలు వీడియోలను పోస్టు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి వీడియోలను రూపొందించిన నటులను ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ తారలు నటించిన ఓ వీడియోను మోదీ ప్రశంసించారు. అక్షయ్ కుమార్, తాప్సి, కార్తీక్‌ ఆర్యన్ తదితరులు ఓ పాట ద్వారా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ వీడియో రూపొందించారు.  ఈ వీడియోనుద్దేశించి ప్రధాని ట్వీట్‌ చేస్తూ.. ‘భారత్‌ మళ్లీ చిరునవ్వులు చిందిస్తుంది, భారత్ మళ్లీ గెలుస్తుంది’ అని పేర్కొన్నారు. ‘భారత్ పోరాడుతుంది. భారత్ గెలుస్తుంది! సినిమా రంగానికి చెందిన సోదరులు చేసిన గొప్ప ప్రయత్నం’ అంటూ ఈ సందర్భంగా తారలు చూపిన చొరవను ప్రధాని ప్రశంసించారు.

ఈ క్లిష్ట సమయంలో ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటే భారత్ చిరునవ్వులు చిందిస్తుందని ‘ముస్కురాయేగా ఇండియా’ పేరుతో రూపొందించిన ఈ పాట ద్వారా నటీనటులు సందేశాన్ని ఇచ్చారు. సోమవారం సాయంత్రం విడులైన ఆ వీడియోను ఆరు లక్షల మంది వీక్షించారు. అక్షయ్ కుమార్‌కు చెందిన ‘కేఫ్‌ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్‌ అండ్ జస్ట్‌ మ్యూజిక్’ దీన్ని రూపొందించింది. ఆ వీడియోలో బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్‌, తాప్సి, భూమి ఫడ్నేకర్, సిద్ధార్థ్‌ మల్హోత్రా, విక్కీ కౌశల్, రాజ్‌ కుమార్ రావు, అనన్య పాండే, కృతి సనన్‌, టైగర్‌ ష్రాఫ్, ఆయుష్మాన్‌ ఖురానా, రకుల్ ప్రీత్‌, జాకీ భగ్నానీ, క్రికెటర్ శిఖర్ ధావన్ కనిపిస్తారు. 
‘ప్రస్తుతం మనచుట్టూ అనిశ్చితి మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. జీవితం ఎక్కడికక్కడ నిలిపోయింది. ఆశను చిగురించేందుకు ఈ పాటను మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అని అక్షయ్‌ కుమార్‌ ట్వీట్ చేశారు. ఈ పాటలో సామాజిక దూరం, చేతులు శుభ్రం చేసుకోడానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా వివరించారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ సందర్భంగా ఇండియా గేట్, హవా మహల్, ముంబయి బీచ్‌ల దృశ్యాలను కూడా పొందుపర్చారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని