రెండో పెళ్లి చేసుకున్న దిల్‌రాజ్‌
close
Published : 12/05/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో పెళ్లి చేసుకున్న దిల్‌రాజ్‌

నిజామాబాద్‌ : ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్‌ రెండో  వివాహం చేసుకున్నారు. నిన్న రాత్రి నిజామాబాద్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ పెళ్లి జరిగింది. లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. తమ కుటుంబానికి ముందు నుంచీ పరిచయం ఉన్న మహిళ తేజస్వినిని (వైఘా రెడ్డి) దిల్‌రాజు వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌కు చెందిన ఆమె హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గతంలో ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేసినట్లు సమాచారం. దిల్‌ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మృతి చెందారు.

తన రెండో పెళ్లి గురించి దిల్‌ రాజు నిన్న పరోక్షంగా అభిమానులకు సంకేతమిచ్చిన విషయం తెలిసిందే. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఆయన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. గత కొంతకాలం నుంచి తన జీవితంలో ఎలాంటి సంతోషం లేదని.. తన వ్యక్తిగత జీవితాన్ని పునఃప్రారంభించడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని