సినీ ప్రముఖులతో మంత్రి తలసాని భేటీ
close
Published : 21/05/2020 18:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినీ ప్రముఖులతో మంత్రి తలసాని భేటీ

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు చిరంజీవి నివాసంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ గురువారం ఉదయం సమావేశమయ్యారు. చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్‌రాజు, జెమిని కిరణ్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దర్శకుడు రాజమౌళి, వి.వి వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎన్‌.శంకర్‌, కొరటాల శివ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

అందరి అభిప్రాయాలు తీసుకొనే ముందుకెళ్తాం

సినీ ప్రముఖులతో సమావేశం ముగిసిన అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ... ‘‘అందరి అభిప్రాయలు తీసుకొని ముందుకెళ్తాం. షూటింగ్‌ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాం. సినిమాల చిత్రీకరణలపై ప్రాధాన్యాలు గుర్తించాలని చెప్పాం. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రాధాన్యం పెరిగింది. థియేటర్లు ప్రారంభం కాగానే ప్రేక్షకులు వస్తారా? లేదా? అనేది ఒక సమస్యగా ఉంది. షూటింగ్‌ ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలపై సినీ పరిశ్రమ పెద్దలు మాట్లాడారు. ఒకట్రెండు రోజుల్లో అన్ని విషయాలపై నిర్ణయాలు జరుగుతాయి. లాక్‌డౌన్‌ లోపు జాగ్రత్తలు పాటిస్తూ మాక్‌ షూటింగ్‌లు చేస్తామన్నారు. సీఎంను కలుస్తామని సినీ పరిశ్రమ ప్రముఖులు అంటున్నారు. సినీ పరిశ్రమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది’’ అని మంత్రి తెలిపారు.

షూటింగ్‌లకు అనుమతిపై పరిశీలిస్తున్నాం..

‘‘సినిమా, టీవీ షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ అంశాలపై సమావేశంలో చర్చించాం. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ఉంది, అయినా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. షూటింగ్‌లకు అనుమతులపై పరిశీలిస్తున్నాం. సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సీసీసీ ద్వారా దాదాపు 14వేల మంది సినీ కార్మికులను ఆదుకున్నారు.. ప్రభుత్వం కూడా ఆ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. 


 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని