ఫోర్బ్స్‌ జాబితాలో ఏకైక భారతీయ సెలబ్రిటీ..
close
Updated : 05/06/2020 19:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫోర్బ్స్‌ జాబితాలో ఏకైక భారతీయ సెలబ్రిటీ..

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న మొదటి వంద మంది సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏకైక  బాలీవుడ్‌ సెలబ్రిటీ, ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్ స్థానం సంపాదించారు. ఫోర్బ్స్‌ వెల్లడించిన ఈ జాబితాలో 52 ఏళ్ల అక్షయ్‌ స్థానం కూడా ఆయన వయసుకు సమానంగా ఉండటం గమనార్హం. కాగా ప్రముఖ హాలీవుడ్‌ నటులు విల్‌ స్మిత్‌, ఏంజలీనా జోలీలనే కాకుండా రిహానా, లేడీ గాగా, కేటీ పెర్రీ, జెన్నిఫర్‌ లోపెజ్‌ వంటి పాప్‌ స్టార్ల కంటే అక్షయ్‌ ముందంజలో నిలవడం విశేషం.

590 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆర్జనతో అమెరికన్ మోడల్‌ కైలీ జెన్నర్‌ ఫోర్బ్స్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. ఇక నటి కిమ్‌ కర్దాషియన్‌ భర్త, పాశ్చాత్య గాయకుడు అయిన కేన్‌ వెస్ట్ 170 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల సంపాదనతో రెండో స్థానంలో ఉన్నారు. హాలీవుడ్‌ నటుడు డ్వెయిన్‌ జాన్సన్‌ 11వ స్థానంలో ఉండగా, ఈ జాబితాలో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు క్రిస్టియానో రోనాల్డో, లియోనల్‌ మెస్సీ టాప్‌ టెన్‌లో చోటు సంపాదించుకున్నారు.

జూన్‌ 2019 నుంచి జూన్‌ 2020 మధ్యకాలంలో  అక్షయ్‌ సంపాదన 48.5 మిలియన్లు అని ఫోర్బ్స్‌ తేల్చింది. అయితే గతేడాది 33వ స్థానంలో ఉన్న అక్షయ్‌.. ఈ సారి 52వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రకటనలో... అక్షయ్‌ తన రానున్న చిత్రాలు ‘బచ్చన్‌ పాండే’, ‘బెల్‌ బాటమ్‌’ల ద్వారా 13 మిలియన్‌ డాలర్లు రాబట్టగలడని అంచనా వేసింది. అంతే కాకుండా కొవిడ్-19 ఉపశమన కార్యక్రమాలకు భారీగా విరాళమిచ్చిన అక్షయ్‌ని భారత దేశంలోనే గొప్ప దాత అని ప్రశంసించింది. గత సంవత్సరం విడుదలైన అక్షయ్‌ చిత్రాల్లో ‘మిషన్‌ మంగళ్‌’, ‘గుడ్‌ న్యూజ్‌’, ‘కేసరి’, ‘హౌస్‌ఫుల్‌ 4’ మంచి కలెక్షన్లు సాధించాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని