దక్షిణాది పాటలకు శిల్పాశెట్టి టిక్‌టాక్‌
close
Updated : 06/06/2020 09:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దక్షిణాది పాటలకు శిల్పాశెట్టి టిక్‌టాక్‌

వైరల్‌గా మారిన వీడియో

ముంబయి: దక్షిణాది చిత్రాల్లోని పలు పాటలతో ప్రేక్షకులను అలరించారు నటి శిల్పాశెట్టి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆమె కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఇటీవల టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన ఆమె తన భర్తతో కలిసి ఫన్నీ వీడియోలు రూపొందించి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. కాగా, తాజాగా శిల్పా.. దక్షిణాది చిత్రాలకు సంబంధించిన పలు ప్రముఖ‌ పాటలకు టిక్‌టాక్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. తెలుగు నుంచి ‘అల.. వైకుంఠపురములో..’లోని ‘సామజవరగమన’, తమిళంలో ‘రౌడీ బేబీ’ పాటలతోపాటు కన్నడ పాటలతో ఆమె మెప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని