‘నాగ్‌ అశ్విన్‌ చెప్పగానే షాక్‌ అయ్యా..!’
close
Published : 09/06/2020 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నాగ్‌ అశ్విన్‌ చెప్పగానే షాక్‌ అయ్యా..!’

వీడియో కాల్‌లో ‘మహానటి’ టీం ముచ్చట్లు

హైదరాబాద్‌: అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా సినిమా తీయాలి అనుకున్నప్పుడు అనేక మంది నటీమణుల్ని అనుకున్నామని, కానీ అందులో కీర్తి సురేశ్‌ లేదని నిర్మాత స్వప్నదత్‌ వెల్లడించారు. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నటులు కీర్తి సురేశ్‌, దుల్కర్‌ సల్మాన్‌, నిర్మాతలు స్వప్న, ప్రియంక, కెమెరామెన్‌ డెనీ వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘మేం అనుకున్నది సాధించాం. కాలేజీ స్టూడెంట్స్‌ కూడా సావిత్రి కథకు కనెక్ట్‌ అవ్వాలి, అందరికీ ఆమె కథ తెలియాలి అనుకున్నాం. కానీ దానికి మించే సాధించాం. ఓసారి మేం అమెరికా వెళ్లినప్పుడు అక్కడి పిల్లలు కూడా ‘ఆహనా పెళ్లంట..’ పాట పాడుతున్నారు. అక్కడి వారు సావిత్రి గారి జీవితం, విజయాలు, పెళ్లి గురించి మాట్లాడుకోవడం విన్నా. దీన్ని నేను ఊహించలేదు’ అని అన్నారు.

కీర్తి సురేశ్‌ మాట్లాడుతూ.. ‘నాలుగన్నర గంటలు కథ విన్న తర్వాత నేను నటించనని చెప్పా. ఎందుకంటే.. నేను భయపడ్డా. సావిత్రి గారు అందరికీ తెలుసు. ఆమె నటనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాంటి పాత్రకు సంతకం చేస్తే.. నేను ఎంతో బాగా నటించాలి. నాపై బాధ్యత పెరుగుతుంది. కానీ నాని నమ్మకంతో ఉన్నారు. అతడి ప్రోత్సాహంతో ముందడుగు వేశా’ అని చెప్పారు.
అనంతరం కీర్తిని ఎంచుకోవడం గురించి స్వప్న ముచ్చటిస్తూ.. ‘సావిత్రి బయోపిక్‌ కోసం చాలా మంది నటీమణుల్ని అనుకున్నాం. ఎన్నో కొలేజ్‌లు చేశాం. వివిధ గ్రూపుల్లో వాటిని షేర్‌ చేసి.. అభిప్రాయాలు అడిగాం. కానీ ఓ రోజు నాగ్‌ అశ్విన్‌.. కీర్తి సురేశ్‌ పేరు చెప్పాడు. నేను షాక్‌ అయ్యా.. మన కొలేజ్‌లో కీర్తి సురేశ్‌ లేదు.. ఎందుకు ఆమెను ఎంచుకున్నారు? అన్నా’ అని తెలిపారు. పూర్తి ఇంటర్వ్యూ మీరూ చూడండి..

 

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని