‘ఆచార్య’.. ఆ నిర్ణయం తీసుకున్నారా?
close
Published : 09/06/2020 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’.. ఆ నిర్ణయం తీసుకున్నారా?

హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’(అధికారికంగా ప్రకటించాల్సి ఉంది). కాజల్‌ కథానాయిక. ఇప్పటికే 40శాతానికి పైగా షూటింగ్‌ పూర్తయింది. కరోనా వైరస్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ  తాత్కాలికంగా వాయిదా పడింది.  కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా లాక్‌డౌన్‌ అడ్డుపడింది. సినిమా షూటింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి ఇవ్వడంతో తర్వాతి షెడ్యూల్‌ను ఎలా తెరకెక్కించాలా? అని చిత్ర బృందం కసరత్తులు ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అగ్ర కథానాయకుల సినిమాలంటే భారీ బడ్జెట్‌ ఉండాల్సిందే. భారీ తారాగణం, యాక్షన్‌ సన్నివేశాలు వెండితెరపై చూస్తుంటే వచ్చే మజానే వేరు. పైగా పెట్టిన పెట్టుబడికిలా ఎలాంటి ఢోకా ఉండదు. అయితే, కరోనా కారణంగా ప్రతి రంగమూ నష్టపోయింది. ఇందుకు చిత్ర పరిశ్రమ అతీతం కాదు. ఇది భారీ బడ్జెట్‌ చిత్రాలపై పెను ప్రభావం చూపనుంది. ఇప్పుడు ‘ఆచార్య’ విషయంలో చిత్ర బృందం ఓ నిర్ణయం తీసుకుందట. బడ్జెట్‌లో కోత విధించినట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని స్కిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేయనున్నారు. అయితే, అవి కథ, కథనాలపై పెద్దగా ప్రభావం చూపవని చిత్ర బృందం భావిస్తోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్‌ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా కనిపిస్తారని, దేవాదాయధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్‌. రామ్‌చరణ్‌ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అటు కొరటాల, ఇటు చిరు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరు సుజీత్‌ దర్శకత్వంలో ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటించనున్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని