బాలయ్య బర్త్‌డే: బోయపాటి గిఫ్ట్‌ అదుర్స్‌
close
Updated : 09/06/2020 19:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలయ్య బర్త్‌డే: బోయపాటి గిఫ్ట్‌ అదుర్స్‌

హైదరాబాద్‌: బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు దర్శకుడు బోయపాటి శ్రీను అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బుధవారం బాలకృష్ణ 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఓ పవర్‌ఫుల్‌ లుక్‌తో కూడిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘BB3 First Roar’ పేరుతో విడుదల చేసిన ఈ టీజర్‌లో బాలయ్య అదరగొట్టేశారు.

‘‘ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో...’’ అంటూ మాస్‌ డైలాగ్‌తో బాలయ్య పలికిన సంభాషణ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి కాగా, లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. 

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత ముచ్చటగా మూడోసారి వీరు కలిసి సినిమా చేస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి ఇప్పుడు టీజర్‌లో విడుదల చేయగా, మరొకటి అఘోర పాత్ర. ఆ పాత్ర కోసం రెండు రకాల గెటప్పులు సిద్ధమైనట్టు సమాచారం. లాక్‌డౌన్‌ తర్వాత ఆ గెటప్పులతో మేకప్‌ టెస్ట్‌లు జరగబోతున్నాయట. అందులో ఒక గెటప్పుని ఖాయం చేసి, సినిమాని పట్టాలెక్కించబోతున్నారు. బాలయ్య సరసన ఈ చిత్రంలో ఓ కొత్త కథానాయిక సందడి చేయనున్నట్టు సమాచారం. ద్వారక క్రియేషన్స్‌  పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని