పవన్‌ గురించి శ్రుతిహాసన్‌ ఏమన్నారంటే
close
Updated : 11/06/2020 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ గురించి శ్రుతిహాసన్‌ ఏమన్నారంటే

‘వకీల్‌సాబ్’పై నటి కామెంట్‌

హైదరాబాద్‌: నటి శ్రుతిహానస్‌ తాజాగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పవన్‌కల్యాణ్‌ గురించి ఏమైనా చెప్పమని ఓ నెటిజన్‌ కోరగా.. ‘ఆయన ఓ అద్భుతం. మంచి మనస్సున్న మనిషి’ అని ఆమె తెలిపారు. అనంతరం ఓ అభిమాని‌.. ‘పవన్‌ ‘వకీల్‌సాబ్‌’ చిత్రంలో మీరు నటిస్తున్నారా?’ అని అడగ్గా.. ‘ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పను’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా మరో నెటిజన్‌.. ‘మేడమ్‌ మీకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నారా? మీకు పెళ్లి అయ్యిందా?’ అంటూ కామెంట్‌ చేశాడు. ‘నాకు బాయ్‌ఫ్రెంఢ్‌ లేడు. అలాగే నాకు పెళ్లి కాలేదు’ అని ఆమె సున్నితంగా సమాధానమిచ్చారు. అయితే గత కొంతకాలం క్రితం మైకేల్ కోర్సోల్‌ అనే వ్యక్తితో శ్రుతిహాసన్‌ సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు.

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అనంతరం 2017లో విడుదలైన ‘కాటమరాయుడు’ చిత్రం కోసం వీరిద్దరూ మరోసారి కలిసి నటించారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ‘క్రాక్‌’తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని