దేవుడా.. నాకు పెళ్లా..?వరుడు ఎవరు?
close
Published : 12/06/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేవుడా.. నాకు పెళ్లా..?వరుడు ఎవరు?

ట్వీట్‌పై స్పందించిన హన్సిక

హైదరాబాద్‌: సెలబ్రిటీల వివాహమంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. అందుకే తారల పెళ్లిళ్ల గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు అవి నిజాలు కావొచ్చు. మరి కొన్నిసార్లు పుకార్లు కూడా అయి ఉండొచ్చు. అయితే నటి హన్సిక పెళ్లి గురించి కూడా అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే హన్సిక ఓ వ్యాపారవేత్తను వివాహమాడనున్నారని పేర్కొంటూ తాజాగా ఓ వెబ్‌సైట్‌ ట్వీట్‌ చేసింది. ఆ వార్త చూసి హన్సిక ఆశ్చర్యానికి గురయ్యారు. ‘పుకార్లు.. దేవుడా‌.. ఇంతకీ వరుడు ఎవరు?’ అని పేర్కొంటూ సదరు వెబ్‌సైట్‌కి రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ వార్తను చూసిన హన్సిక స్నేహితుడు ‘ఓ మై గాడ్‌.. ఇప్పటివరకూ ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు?’ అని ఆమెకు ట్వీట్‌ చేశాడు. ‘నాక్కూడా ఇప్పుడే తెలిసింది. అందుకే చెప్పలేకపోయాను (నవ్వుతున్న ఎమోజీలు)’ అని సమాధానమిచ్చారు.

‘దేశముదురు’ చిత్రంతో హన్సిక తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యారు. బన్నీ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్‌ లభించాయి. ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రామ్‌, విష్ణు సినిమాల్లో ఆమె ఆడిపాడారు. గతేడాది విడుదలైన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో హన్సిక నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘మహా’, ‘పార్ట్నర్‌‌’ తమిళ చిత్రాలు ఉన్నాయి.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని