నటి కావాలనుకున్నా.. బాధపడ్డా..!
close
Published : 13/06/2020 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నటి కావాలనుకున్నా.. బాధపడ్డా..!

నిజమైన సంతోషం ఎక్కడుందో అర్థమైంది: మంజుల

హైదరాబాద్‌: చిన్నప్పటి నుంచి గొప్పనటిని కావాలని ఎన్నో కలలు కన్నానని సూపర్‌స్టార్‌ కృష్ణ కుమార్తె మంజుల అన్నారు. నటిగా, దర్శకురాలిగా గుర్తింపు పొందిన ఆమె తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. తన వ్యక్తిగత జీవితాన్ని తెలియజేస్తూ మొదటి వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. మెడిటేషన్‌, సెల్ఫ్‌ డెవలప్‌మెంట్‌ వల్ల నిజమైన సంతోషం ఎక్కడ ఉందో తెలుసుకున్నానని తెలిపారు.

‘సూపర్‌స్టార్‌ కృష్ణగారి కుమార్తెగా, మహేశ్‌బాబు సోదరిగా, ‘పోకిరి’ ప్రొడ్యూసర్‌గా నేను అందరికీ తెలుసు. వీటన్నింటికీ నేను ఎంతగానో సంతోషించాను. కానీ నా జీవితంలో కూడా బాధలున్నాయి. వాటితో పోరాటం చేశాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. కృష్ణగారి కుమార్తె కావడం వల్ల చిన్నప్పటి నుంచి గొప్ప నటిని కావాలని కల ఉండేది. మా నాన్నే నాకు స్ఫూర్తి. కానీ నటిని కావడానికి సూపర్‌స్టార్‌ అభిమానులు ఒప్పుకోలేదు. తమ అభిమాన హీరో కుమార్తె వెండితెరపై డ్యాన్స్‌లు చేయడం వాళ్లకి ఇష్టం లేదు. అలా నా కల సాకారం కాలేదు. నటి కావడానికి ఎంతో ప్రయత్నం చేశా, చివరికి నటన రంగంలోకి వెళ్లలేకపోయానని బాధపడ్డా. ఆ బాధను ఎలా పోగొట్టుకోవాలో అర్థం కాలేదు. ఒకరోజు అనుకోకుండా మెడిటేషన్‌ చేశా. అలా మొదటిసారి లోలోపల ఉన్న నా బలాన్ని తెలుకోగలిగాను. నా ఆలోచనలు, నమ్మకాలు అన్నీ అర్థమయ్యాయి. కమర్షియల్‌ సినిమాకి నేను కరెక్ట్‌ కాదని తెలుసుకున్నా.. ఓ మంచి కథా చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకున్నా. అలా ‘షో’ రూపుదిద్దుకుంది. మెడిటేషన్‌, సెల్ఫ్‌ డెవలప్‌మెంట్‌.. వీటివల్ల నిజమైన సంతోషం మనలోనే ఉందని అర్థమైంది.’ అని మంజుల పేర్కొన్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని