మాస్క్‌మెన్‌ గురించి ఎవరికీ తెలీదు..!
close
Updated : 13/06/2020 20:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌మెన్‌ గురించి ఎవరికీ తెలీదు..!

కీర్తి సురేశ్‌ చాలా భయపడింది: దర్శకుడు

హైదరాబాద్‌: ‘పెంగ్విన్‌’ చిత్రంలోని మాస్క్‌ మెన్‌ గురించి టీంలో ఎవరికీ తెలియదని దర్శకుడు ఈశ్వర్‌ కార్తిక్‌ అన్నారు. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘పెంగ్విన్‌’ చిత్రంలో కీర్తిసురేశ్‌ కీలకపాత్రను పోషించారు. అయితే మరికొన్నిరోజుల్లో ప్రేక్షకులను అలరించనున్న ఈ సినిమా గురించి దర్శకుడు ఈశ్వర్‌ ఆసక్తికర విశేషాలను తెలియజేశారు. షూటింగ్‌ సమయంలో కొన్ని మర్చిపోలేని ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.

‘‘పెంగ్విన్‌’ కథను 18 రోజుల్లోనే రాశాం. 36 రోజుల్లోనే షూట్‌ పూర్తి చేశాం. షూటింగ్‌ సమయంలో కొన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కొడైకెనల్‌లో షూట్‌ చేస్తున్న సమయంలో ఓరోజు సెట్‌లో ఏర్పాటు చేసిన భారీ లైట్స్‌ ప్రమాదవశాత్తు తేనేపట్టు మీద పడ్డాయి. దీంతో ఒక్కసారిగా తేనేటీగలు చిత్రబృందంపై దాడి చేశాయి. ఆ సమయంలో కీర్తి అక్కడే ఉన్నారు. ఈ ఘటనతో ఆమె భయాందోళనలకు గురయ్యారు. తేనేటీగల దాడిలో కొంతమంది సభ్యులు గాయపడిన కారణంగా కొంతసమయం షూటింగ్‌ నిలిపివేశాం. చికిత్స అనంతరం తిరిగి ప్రారంభించాం. ఈ సినిమాలోని మాస్క్‌ మెన్‌ గురించి టీంలో ఎవరికీ తెలీదు. కీర్తికి కూడా షూటింగ్‌ తర్వాతే ఆ పాత్రను ఎవరు పోషిస్తున్నారో చెప్పాం.’ అని దర్శకుడు వివరించారు.

జూన్‌ 19న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. థియేటర్‌లో విడుదల చేయాలని మొదట భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీ వేదికగా రీలీజ్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. కార్తీక్‌ సుబ్బరాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో కీర్తి తల్లిపాత్రను పోషించారు. ఇటీవల విడుదలైన ‘పెంగ్విన్‌’ ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని